రెచ్చిపోతున్న సైబ‌ర్ నేర‌గాళ్లు ! 1 m ago

featured-image

సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని త‌స్క‌రించి ప్రజల బ్యాంకు ఖాతాల‌ను లూఠీ చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కేసు విచిత్రంగా ఉంది. ఏదో ఒక తెలియని నంబర్ నుండి కాల్ రావడంతో తెలియక‌ ఫోన్ తీసిన ఓ వృద్ధుడి బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. ఇప్పుడు దీనిపై పోలీసులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. తెలియ‌ని కాల్స్ ఎవ‌రు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయ‌కుండా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఢిల్లీలోని ద్వారకాలో నివాసం ఉంటున్న‌ 73 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ చౌదరికి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. తాను కాల్ చేసిన వ్యక్తి చెప్పేది మాత్రమే విన్నానని, అతని సూచనల మేరకు ఏమీ చేయలేదని చెప్పారు. అయినా కూడా అతని ఖాతా నుంచి ఎవరో రూ.16 లక్షలు డ్రా చేశారు. చౌదరి ఫిర్యాదు మేరకు ద్వారకా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలు లేదా కాల్‌లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆయ‌న ఏం చెప్పాడంటే...

త‌న‌కు ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తి ఓ ఫోన్ నంబ‌ర్ నుండి ఫోన్ చేసి తన మొబైల్ సిమ్‌ను 4G నుండి 5Gకి అప్‌గ్రేడ్ చేయమని అడిగాడు. తాను కాల్ చేసినా స్పందించలేదని, వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వ‌లేద‌ని తెలిపాడు. అంతేకాకుండా ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయలేదన్నారు. అయితే ఈ కాల్ వచ్చిన మూడు రోజుల్లోనే త‌న‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.16,64,300 డ్రా అయ్యాయని చెప్పాడు.

ఇవి కొత్తేం కాదు

ఇలాంటి డిజిటల్ మోసాలకు వృద్ధులు బలికావడం ఢిల్లీలో ఇదే తొలిసారి కాదు. జూలైలో దక్షిణ ఢిల్లీలోని సీఆర్‌ పార్క్‌లో నివసిస్తున్న 72 ఏళ్ల కృష్ణ దాస్‌గుప్తా కూడా ఇదే విధమైన మోసానికి గుర‌య్యాడు. దీనిలో మోసగాళ్ళు అత‌న్ని "డిజిటల్‌గా అరెస్టు చేయడం" ద్వారా అత‌ని బ్యాంక్ ఖాతా నుండి రూ. 83 లక్షలు దోచుకున్నారు. మేలో ఒక వృద్ధుడికి తెలియని నంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది, అందులో ఒక మహిళ అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు కనిపించింది. వృద్ధుడు వెంటనే కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. అయితే అతనికి వెంటనే సైబర్ క్రైమ్ డివిజన్ పేరుతో కాల్స్ రావడం ప్రారంభించాయి. స్క్రీన్‌షాట్‌ను వైరల్ చేసి అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించారు. దీని కారణంగా వృద్ధుడు వారికి రూ. 47,076 బదిలీ చేశాడు. 


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD